Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలతెలంగాణ - అంకారా
ఓ వైపు సహాయక చర్యలు చేపడుతున్న తరుణంలోనే మధ్యాహ్నం ఆగ్నేయ టర్కీలో రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో రెండోసారి భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.24 గంటలకు ఎకినోజు పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా నాలుగు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సిరియా జాతీయ భూకంపం కేంద్ర అధిపతి రేద్ అహ్మద్ ప్రభుత్వ అనుకూల రేడియోతో మాట్లాడుతూ చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపమన్నారు.
తాజా భూకంపం ధాటికి తుర్కియేతో పాటు సిరియాలోని డమాస్కస్, లటాకియా ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వీటి ధాటికి వేలాది భవనాలు నేలమట్టాయి. ఈ విలయంలో ఇరు దేశాల్లో 1600 మందికి పైగా మృతిచెందారు. ఒక్క తుర్కియేలోనే 912 మంది మృతిచెందినట్లు అధ్యక్షుడు ఎర్డోగాన్ వెల్లడించారు. తమ దేశ చరిత్రలోనే అత్యంత భారీ విపత్తు ఇది అని అన్నారు.