Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజీఎల్ టైర్- 2, సీహెచ్ఎస్ఎల్ టైర్- 1 పరీక్ష తేదిలు
నవతెలంగాణ - ఢీల్లి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (సీజీఎల్), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ పరీక్ష(సీహెచ్ఎస్ఎల్)కు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇప్పటికే సీజీఎల్ టైర్- 1 పరీక్షను పూర్తి చేసిన ఎస్ఎస్సీ. తాజాగా టైర్ 2 పరీక్ష తేదీలను ఖరారు చేసింది. గ్రూప్ బి, సీ విభాగాల్లో సుమారు 20వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ పరీక్షను మార్చి 2 నుంచి 7వరకు నిర్వహించనున్నట్టు సోమవారం ప్రకటించింది. అలాగే, 4500 లోయర్ డివిజన్ క్లర్కులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఉద్యోగాలను భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్ష టైర్- 1ను మార్చి 9 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్టు తాజాగా తెలిపింది. మరిన్ని వివరాలు https://ssc.nic.in/ లో పొందొచ్చని అభ్యర్థులకు సూచించింది.