Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బెంగళూరు
రద్దీ మార్కెట్లో ఓ యువకుడు కత్తిలో హల్చల్ చేశాడు. జీన్స్ ప్యాంట్, నల్లటి బనియన్ ధరించి ఉన్న అతడు కత్తితో మార్కెట్ మధ్యలోకి దూసుకొచ్చాడు. చంపేస్తానని స్థానికులను బెదిరించడం మొదలుపెట్టాడు. కర్ణాటక రాష్ట్రం కలబురిగిలోని మార్కెట్లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ క్రమంలో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని చుట్టుముట్టి లొంగిపోమ్మని ఆదేశించారు. పోలీసుల ఆదేశాలను నిందితుడు లెక్కచేయలేదు. పైగా వాళ్లపై కూడా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
ఈ తరుణంలో పోలీసులు అతడిని షూట్ చేశారు. కాళ్లపై కాల్పులు జరపగానే నిందితుడు కింద పడిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని లాఠీలతో చితకబాదారు. బూటు కాళ్లతో తన్నారు. అనంతరం తీసుకెళ్లి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపనున్నట్లు తెలిపారు.