Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అంకారా
వరుస మూడు భారీ భూకంపాల తాకిడికి టర్కీ, సిరియా దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. ఈ తరుణంలో మృతుల సంఖ్య 1900 దాటిపోయింది. భూకంపాల తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య 5 వేలకు పైనే ఉండొచ్చని రిపోర్టులు తెలుపుతున్నాయి. దక్షిణ టర్కీలోని గజియాన్టెప్ సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి.
రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.24 గంటలకు రెండోసారి 7.5 తీవ్రతతో, ఆ తర్వాత కొద్దిసేపటికే 6.0 తీవ్రతతో మూడోసారి భూకంపాలు కకావికలం చేశాయి. సిప్రస్, టర్కీ, గ్రీస్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యూకే, ఐరాక్, జార్జియాలోనూ భూకంపం సంభవించింది. ఉత్తర నగరం అలెప్పో, సెంట్రల్ సిటీ హమాలో కొన్ని భవనాలు కుప్పకూలినట్లు సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. బీరూట్, డమాస్కస్లలో అపార్ట్మెంట్లు, భవనాలు కంపించడంతో స్థానిక ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. మృతుల వివరాలు వెంటనే తెలియలేదు.