Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లు ఇవాల్టి (ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌లు జరగగా నాలుగో మ్యాచ్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా (44 పరుగులు) విజయం సాధించింది.
అయితే వార్మప్ మ్యాచే కదా అని తేలిగ్గా తీసుకున్న భారత్ ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ జర్నీని ఓటమితో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారత బౌలర్లు శిఖా పాండే (3-0-9-2), పూజా వస్త్రాకర్ (3-0-16-2), రాధా యాదవ్ (3-0-22-2), గైక్వాడ్ (3-0-21-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (28), ఆష్లే గార్డనర్ (22) ఓ మోస్తరుగా రాణించగా ఆఖర్లో వేర్హామ్ (32 నాటౌట్), జొనాస్సెన్ (22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఈ తరుణంలో 130 పరుగులు సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేసి 15 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ తమ తదుపరి వార్మప్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.