Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సెల్‌ఫోన్ చూడొద్దంటూ తల్లి కోపంగా అన్నందుకు ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. ధూళపల్లి గ్రామానికి చెందిన మూర్తి కూతురు సాధన (17) నిత్యం ఫోన్ పట్టుకుని ఉంటుంది.
కూతురు ఎప్పుడు సెల్‌ఫోన్ పట్టుకుని ఉండటాన్ని గమనించిన తల్లి గట్టిగా మందలించింది. ఈ తరుణంలో తల్లి మాటలకు కోపానికి గురైన సాధన మనస్తాపానికి గురై ఫోన్ ఆఫ్ చేసి పడుకుంటున్నానని చెప్పి. నేరుగా తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతసేపటి తర్వాత గదిలోకి వెళ్లి చూసిన తల్లిదండ్రులు కూతురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.