Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లాంబుల్
టర్కీ విలవిలలాడింది. సిరియాతో సరిహద్దు ఉన్న దక్షిణ టర్కీ.. భారీ భూకంపంతో వణికిపోయింది. వేలాది బిల్డింగ్లు నేలమట్టం కావడంతో.. వేల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 4.12 నిమిషాలు.. జనం నిద్రమత్తులో ఉన్న సమయంలో వచ్చిన భూకంపం ధాటికి ఇప్పటికే 2600 మందికిపైగా మృతిచెందారు. ఇంకా వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భూకంపం వల్ల టర్కీలో 1600 మంది మృతిచెందగా.. సిరియాలో 700 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్క టర్కీలోనే దాదాపు 2828 బిల్డింగ్లు నేలమట్టం అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ దేశంలో ప్రాణ నష్టం ఎంతగా ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇప్పుడిప్పుడు అక్కడ జరిగిన బీభత్సానికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. లెవల్ ఫోర్ అప్రమత్తతను టర్కీ ప్రకటించింది. అంతర్జాతీయ దేశాల సహాయాన్ని కోరారు టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్. సిరియాలోని అలెప్పొ, హమా, లటాకియా, టార్టస్ ప్రాంతాల్లో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.