Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్- 2023 తొలి విడత పరీక్షను 8.22లక్షల మంది రాశారు. సోమవారం తుది కీని విడుదల చేసిన ఎన్టీఏ.. అక్కడికి కొద్ది గంటల వ్యవధిలోనే ఫలితాలనూ వెల్లడించింది. మరోవైపు రెండో విడత పరీక్షలు ఏప్రిల్లో జరగనుండగా దానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరగనున్నాయి.