Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ
మండలంలోని పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. డీసీఎం టైరు పంక్చర్ కావడంతో టైరు మారుస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో డీసీఎం డ్రైవర్, క్లీనర్‌తో పాటు ఆరేళ్ల పాప కూడా మృత్యువాత పడింది. కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.