Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పెరూ
దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 15 మంది మృతి చెందినట్టు పేరూలోని జాతీయ అత్యవసర సేవ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలియజేసింది. ఈ ఘటనలో గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. వీరిని రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. వర్షా బాధితులను ఆదుకునేందుకు హెలికాప్టర్లు, టెంట్లు, నీటి ట్యాంకులు, ఇసుక సంచులు, విపత్తు సహాయక సిబ్బంది ద్వారా అందిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది. కమనా ప్రావిన్స్‌లోని సెకోచా పట్టణానికి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మరో ఐదుగురు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణపెరూలో జరిగిన ఘటనపై అరేక్విపా గవర్నర్ రోహెల్ సాంచెజ్ స్పందిస్తూ దక్షిణ పెరూలోని నాలుగు పట్టణాల్లో వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. అరేక్విపా అంతటా దాదాపు 12వేల మంది వర్షాప్రభావానికి లోనయ్యారని వివరించారు.