Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని ఫించ్ మంగళవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో నేను ఆడలేనని, ఇలాంటి సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనదని అన్నాడు. తద్వారా జట్టుకు భవిష్యత్ నాయకుడిని తయారు చేసుకోవచ్చన్నారు. ‘‘నాకు మద్ధతుగా నిలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, సహాచరులు, తోటి మిత్రులకు కృతజ్ఞతలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ తెలుపుతూ ట్వీట్ చేశాడు. అయితే..తన క్రికెట్ జర్నీలో 2015 వన్డే వరల్డ్ కప్, 2020టీ20 ప్రపంచకప్ సాధించడం మరువలేని జ్ఞాపకాలని తెలిపాడు. ఇక తన క్రికెట్ కెరీర్లో ఎక్కువ సార్లు ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఫించ్ తనదైన శైలిలో దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకునేవాడు. ఫించ్ తొలి టీ20 ప్రపంచకప్ ను ఆసీస్ కు అందించిన తొలి కెప్టెన్ గా రికార్డ్ లో నిలిచాడు. 36 ఏళ్ల ఫించ్ ఆస్ట్రేలియా జట్టు 2015లో వరల్డ్ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.