Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టర్కీ, సిరియాలో సంభవించిన మూడు శక్తివంతమైన భూకంపాలు విలయం సృష్టించిన సంగతి తెలిసిందే. టర్కీ, సిరియాలో చోటు చేసుకున్న భూకంప దృశ్యాలు తనను తీవ్రంగా కలిచివేశాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవాళికి చాలా బాధాకరమని పేర్కొన్నారు. టర్కీ, సిరియా ప్రజలకు ఆ భగవంతుడు మరింత శక్తినివ్వాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేటీఆర్.