Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లాంబుల్
తుర్కియేలో సోమవారం మూడు శక్తివంతమైన భూకంపాలు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే భూకంపాల వల్ల తుర్కియేలో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ పేలినట్లు ట్విట్టర్లో కొన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి. నిజానికి ప్లాంట్ పేలినట్లు ఆ వీడియోలో కనిపిస్తున్నా.. అది నిజమో కాదు ఇంకా తెలియదు. ఆ పేలుడు వీడియో.. ప్లాంట్దా లేక ఇతర ప్రాంతానిదా అన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ ఓ వీడియో మాత్రం ట్విట్టర్లో షేర్ అవుతోంది. ఆ వీడియోపై ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తుర్కియేలో వచ్చిన భూకంపం వల్ల అయుకు న్యూక్లియర్ ప్లాంట్‌లో ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్లాంట్ వద్ద సేఫ్టీ చెకింగ్లు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ అణు ప్లాంట్‌లో నిర్మాణం జరుగుతున్నది. అణు ప్లాంట్ వద్ద రేడియేషన్ సమస్యలు ఉత్పన్నం కాలేదని నిపుణులు చెబుతున్నారు. న్యూక్లియర్ ప్లాంట్ వద్ద రిక్టర్ స్కేల్‌పై 3 తీవ్రతతో భూకంపాలు వచ్చినట్లు రష్యా న్యూక్లియర్ ఏజెన్సీ కెంపెనీ రోసాటమ్ తెలిపింది.