Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - టర్కీ
వరుస భూకంపంతో అతాలకుతలమైన టుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత్‌కు చెందిన తొలి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుంది. టీమ్‌లో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది, ముగ్గురు సీనియర్ అధికారులు ఉన్నారు. వారితోపాటు రక్షణ చర్యల్లో తర్ఫీదు పొందిన డాగ్ స్క్వాడ్‌ను కూడా టుర్కియేకు చేరవేశారు. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన సామాగ్రిని కూడా వారితో పంపించారు. వాటిలో ఔషధాలు, డ్రిల్లింగ్ మెషిన్లు, కటింగ్ మిషన్లు తదితర సామాగ్రి ఉన్నాయి.
యాభై మందితో కూడిన తొలి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని భారత వాయుసేకు చెందిన సీ17 విమానం టుర్కియేకు చేరవేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలోని టుర్కియే రాయబార కార్యాలయం కూడా భారత్ పంపిన తొలి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ భూకంప కల్లోలిత ప్రాంతానికి చేరుకుందని ప్రకటించింది. కాగా, ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి మరో ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా టుర్కియేకు బయలుదేరింది.