Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు. 'మంత్రి హరీశ్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌజ్ కి వెళ్లారు. అందులో ఆయన మామ పాత సారా పోశారు' అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడారు. గతేడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో కొత్తగా ఏమీ లేదని, గతేడాది బడ్జెట్ను కాపీ పేస్ట్ చేశారని, ఈ ఏడాది కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు. అసలు కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే లేదని విమర్శించారు. పథకాలకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టకపోతే ఎందుకని నిలదీశారు. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీఎం ఇచ్చిన మాటకు విలువ ఉండదా? అని ప్రశ్నించారు. సీఎం మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం గడప దాటవని ఎద్దేవా చేశారు.