Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ మేయర్ ఎన్నిక ముచ్చటగా మూడోసారి కూడా వాయిదా పడటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. నిన్న ప్రతిపక్ష బీజేపీ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల మధ్య సభలో మళ్లీ గందరగోళం చెలరేగడంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోకుండానే సభ వాయిదా పడింది. మునిసిపల్ హౌస్ సమావేశమైన తర్వాత పాత ఘటనలే పునరావృతమ్యాయి.