Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. కాగా, ఈ సినిమాలో చిరు సరసన శుత్రిహాసన్ నటించగా.. మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా బాస్ పార్టీ అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. చాలా సెంటర్స్ లో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.