Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. రేపు ఆర్బీఐ ద్వైమాసిక సమావేశ నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.