Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కార్పొరేట్ దిగ్గజాల కొలువుల కోతకు తెరపడటం లేదు. ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్ కంపెనీలతో పాటు పలు కంపెనీలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. ఈ ఏడాది 2 వేల వైట్ కాలర్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు బోయింగ్ కసరత్తు సాగిస్తోంది. అట్రిషన్, లేఆఫ్స్ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమైనట్టు అమెరికన్ ప్లేన్మేకర్ వెల్లడించింది. 2022లో 15,000 మందిని నియమించుకోగా 2023లో 15,000 మందిని హైర్ చేస్తామని గత నెలలో ప్రకటించిన బోయింగ్ తాజాగా ఆ ప్రయత్నాలను విరమించుకుంది. ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో ఈ ఏడాది 2000 మంది ఉద్యోగులను తొలగించాలని కసరత్తు సాగుతోందని కంపెనీ వెల్లడించిందని సీటెల్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. మూడో వంతు ఉద్యోగులను భారత్‌లో టాటా కన్సల్టింగ్ సర్వీసెస్‌కు అవుట్సోర్సింగ్ చేస్తామని కంపెనీ పేర్కొంది. తమ కార్పొరేట్ స్వరూపాన్ని సరళీకరిస్తామని బోయింగ్ స్పష్టం చేసింది. తయారీ, ఉత్పత్తి అభివృద్ధిపై అధిక నిధులు వెచ్చించేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని బోయింగ్ పేర్కొంది.