Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారు నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. భార్య చూస్తుండగానే ఓ భర్త బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పీరంచెరువు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రేవన్ సిద్ధప్ప అనే వ్యక్తికి.. తన భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది. దంపతులిద్దరూ మాటా మాటా అనుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన సిద్ధప్ప.. భార్య చూస్తుండగానే ఓ భవనం పైకి ఎక్కి కిందికి దూకాడు. బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కింద పడడంతో సిద్ధప్ప తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సిద్ధప్ప మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.