Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. కొత్త దర్శకుడు మురళీ కిశోర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. హీరో సాయి ధరమ్‌తేజ్ ఈ ట్రైలర్ విడుదల చేశారు. ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. హీరో చెప్పె డైలాగ్స్.. చేసిన ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో కిరణ్ జోడీగా కశ్మీర పరదేశి అలరించనుంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తుండగా..మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్నాడు.