Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎటుచూసినా ఆర్తనాదాలు.. భవన శిథిలాల గుట్టలు.. వాటికింద క్షతగాత్రుల రోదనలు.. క్షణక్షణం భయపెడుతూ భూప్రకంపనలు.. ఎముకలు కొరికే చలి.. ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు.. ఇదీ టర్కీ, సిరియా దేశాల్లో ప్రస్తుత దుస్థితి. రెండ్రోజుల నుంచి ఈ దేశాల్లో భూకంపాలు సంభవిస్తూ వేలాది మంది ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్నాయి. ఈ భూకంపం సృష్టించిన విధ్వంసం వల్ల రెండు దేశాల్లో ఇప్పటికే 7,700 మంది మరణించారు. భవన శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. శిథిలాల తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తుతో ప్రాణనష్టం 20వేలకు పైగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.