Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టోఫెల్ ఆన్ లైన్ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్ ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఆన్ లైన్లో జరుగుతున్న ఎగ్జామ్ ని కాపీ చేశారు కేటుగాళ్లు. పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా నడుపుతున్న మాస్ కాపీయింగ్ లో రెండు గ్యాంగుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు టోఫెల్ ఎగ్జాం తప్పనిసరి. దీంతో ముఠా మాస్ కాపీయింగ్ కు పాల్పడుతోంది.