Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: భారీ భూకంపంతో కష్టాల్లో ఉన్న టర్కీ, సిరియాను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం తన వంతుగా సహాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా రెస్క్యూ, వైద్య సిబ్బందితో పాటు రిలీఫ్ మెటీరియల్‌తో కూడిన ఇండియ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు సిరియాకు చేరుకున్నాయి. మంగళవారం బయల్దేరిన విమానాల్లో రిలీఫ్ మెటీరియల్, వైద్య, రెస్క్యూ సిబ్బందిని టర్కీకి పంపింది. విమానంలో 6.5 టన్నుల ఔషధాలు, వైద్య ఉపకరణాలు, సర్జన్లు, పారామెడికల్ సిబ్బందిని తరలించింది. అదేవిధంగా 30 పడకల దవాఖానను అక్కడ నెలకొల్పేలా ఎక్స్‌రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లు కూడా వాటిలో ఉన్నాయి. ఇక 101 మంది జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు ప్రత్యేక విమానాల్లో అక్కడికి చేరుకున్నారు.
టర్కీ, సిరియా దేశాలపై సోమవారం వరుస భూకంపాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. భూకంపాల కారణంగా ఇప్పటి వరకు రెండు దేశాల్లో దాదాపు 7,700 మంది మరణించినట్టు అధికారిక, మీడియా వర్గాలు వెల్లడించాయి. టర్కీలో 4,500 మందికి పైగా మృత్యువాత పడ్డారని, 21 వేల మందికి పైగా గాయాలయ్యాయని ఆ దేశ ఉపాధ్యక్షుడు ఫుయత్ ఒక్తే తెలిపారు.