Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సరికొత్త పరిష్కారాన్ని తీసుకొస్తోంది. కొన్ని ముఖ్యమైన బ్యాంకులతో కలిసి క్యూఆర్ కోడ్ బేస్డ్ కాయిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఎంపిక చేసిన 12 నగరాల్లోని 19 ప్రాంతాల్లో ఈ మిషన్లను పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అయితే సాధారణంగా కాయిన్ వెండింగ్ మిషన్లలో మనం నోట్లు పెడితే అందుకు తగినంత నగదు నాణేల రూపంలో వస్తుంది. కానీ నోట్లు లేకుండా నగదు నాణేల రూపంలో కావాల్సినవారు ఈ మిషన్ల ద్వారా పొందవచ్చు. ఇతర కాయిన్ వెండింగ్ మిషన్ల మాదిరిగా కాకుండా ఇది యూపీఐ వ్యవస్థ అనుసంధానంతో పనిచేస్తుంది. కాయిన్స్ కోసం నోట్లు ఇవ్వాల్సిన పనిలేదు. వినియోగదారులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమకు కావాల్సిన నాణేలు, అవసరమైన డినామినేషన్లో పొందవచ్చు.