Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. దీంతో రెండ్రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఊహించినట్లుగానే ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచడం సూచీలపై పెద్దగా ప్రభావం చూపలేదు. ముఖ్యంగా అదానీ ఎంటర్ ప్రైజెస్, పేటీఎం, రిలయన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కలిసొచ్చింది. ఐటీ, ఫార్మా, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది.
ఈ తరుణంలో సెన్సెక్స్ 377 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 17,850 పాయింట్ల ఎగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.50గా ఉంది. ఉదయం 60,332.99 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైన సెన్సెక్స్ ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 500కు పైగా పాయింట్ల లాభంతో 60,792 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 377.75 పాయింట్ల లాభంతో 60,663.79 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 150 పాయింట్ల లాభంతో 17,871.70 వద్ద స్థిరపడింది.