Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ తరుణంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో బడ్జెట్లను ప్రవేశపెట్టేటప్పుడు ఒక దశ దిశ ఉండేది. ఆర్థిక సర్వేలకు దగ్గరగా కేంద్ర బడ్జెట్ ఉండేదన్నారు. దానికి తగినట్టు దేశ ప్రగతి కూడా ఉండేదన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో బడ్జెట్లో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అని అన్నారు.
మోడీ మొదటి బడ్జెట్లో చెప్పిన థీమ్ – సబ్ కా సాత్ సబ్ కా వికాస్. కానీ ఆ ఏడాదంతా మాబ్ లించింగ్‌లు జరిగాయి. రెండో బడ్జెట్లో నల్లధనాన్ని అరికడుతాం అని మరుసటి సంవత్సరమే పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆర్థిక వ్యవస్థ చితికి పోయిందని గుర్తు చేశారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయన్నారు.
ఈ తరుణంలోనే జీడీపీని మంటగలపడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో, రూ. 160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో, సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో, సిలిండర్ ధరలు పెంచడంలో, పసి పిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించడంలో, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో, మతపిచ్చి మంటలు రేపడంలో బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయిందని హరీశ్‌రావు మండిపడ్డారు.