Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎమ్మెల్యేలకు ఎర కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీజే ధర్మాసనంలో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా ప్రభుత్వం వేసిన పిటిషన్ తమ పరిధిలోకి రాదని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ తరుణంలో ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలు ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు డిసెంబరు 31, జనవరి 5, 9, 11, 26 తేదీల్లో లేఖలు రాశారు. తాజాగా రెండ్రోజుల క్రితం సీబీఐ ఎస్పీ సీఎస్ శాంతికుమారికి లేఖ రాశారు. దీనిలో మొయినాబాద్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని సీబీఐ కోరింది. కేసు దర్యాప్తు బాధ్యతను ఢీల్లి విభాగానికి సీబీఐ డైరెక్టర్ అప్పగించారు.