Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేరళ
మరికొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులం కాబోతున్నామని కేరళకు చెందిన ఓ ట్రాన్స్జెండర్ జంట ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా ఆ జంట ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. కొయ్కోడ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్జండర్లలో ఒకరైన జహాద్ బుధవారం ఉదయం బిడ్డకు జన్మనిచ్చారు. దేశంలో తొలిసారి ఓ ట్రాన్స్జెండర్ జంట తల్లిదండ్రులు కావడం విశేషం.
కేరళకు చెందిన జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్జెండర్ జంట గత మూడేళ్ల నుంచి కలిసి ఉంటోంది. సంతానం కావాలని భావించిన వారు తొలుత ఎవరినైనా దత్తత తీసుకోవాలని భావించారు. అయితే, నిబంధనలు కఠినంగా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తర్వాత జియా పావెల్ అబ్బాయిగా మారేందుకు హార్మోన్ థెరపీ చేయించుకోవాలని అనుకున్నారు. కానీ, సొంతంగా సంతానం కనాలని నిర్ణయించుకున్న ఆ జంట ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం బేబీ, జహాద్లిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.