Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశంలో గత ఐదేళ్లలో పోలీస్ కస్టడీలో 669 మంది మరణించారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు పోలీస్ కస్టడీలో 669 మంది చనిపోయినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) గణాంకాలను ఆయన వెల్లడించారు. 2021-2022లో పోలీసు కస్టడీలో మొత్తం 175 మరణాలు సంభవించినట్లు తెలిపారు. 2020-2021లో 100, 2019-2021లో 112, 2018-2019లో 136, 2017-2018లో 146 లాకప్ డెత్లు నమోదయ్యాయని తెలిపారు. కాగా, 2017 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో 201 కేసులకు గాను రూ.5,80,74,998 పరిహారంతోపాటు ఒక కేసులో క్రమశిక్షణా చర్యలను ఎన్హెచ్ఆర్సీ సిఫార్సు చేసిందని తెలిపారు. అయితే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం పోలీస్, పబ్లిక్ ఆర్డర్ రాష్ట్ర అంశాలని మంత్రి స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు.