Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక సూచన చేసింది. రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నట్లు. సెకండియర్‌లో మాత్రం 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఎంసెట్ రాయబోయే విద్యార్థులు 2021-22లో ఫస్టియర్ పరీక్షలు రాశారని, కరోనా కారణంగా అప్పుడు 70 శాతం సిలబస్‌తోనే వార్షిక పరీక్షలు నిర్వహించినందున ఎంసెట్‌లో ప్రథమ సంవత్సరంలో అదే సిలబస్ ఉంటుందని స్పష్టం చేశారు.