Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలో మంగళ, బుధవారాలు ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు ప్రధాన రహదారులు, వీధులూ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఒకవైపు శాసనసభా సమావేశాలు, ఈనెల 11న ఫార్ములా-ఈ రేసింగ్, 15 వరకు నుమాయిష్, 17న నూతన సచివాలయం ప్రారంభం, 18న శివరాత్రి వేడుకలు జరగనున్న ఈ తరుణంలో ఇంకో 10 రోజులపాటు వాహనదారులకు తప్పని ట్రాఫిక్ కష్టాలు తప్పవు.
అంతే కాకుండా ట్రాఫిక్ పోలీసులు 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నా పరిస్థితిని చక్కదిద్దటం సవాలుగా మారింది. రోజుకు 17,000 చలానాలు గ్రేటర్లో 80 లక్షలకుపైగా వాహనాలున్నాయి. వీటిలో 30-40 లక్షలు రాకపోకలు సాగిస్తుంటాయని అంచనా వేస్తున్నారు. గురు, శుక్రవారాలు తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ ఉల్లంఘనులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం. వచ్చే శని, ఆదివారాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అదనంగా 500-600 మందిని రంగంలోకి దింపేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.