Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీకాకుళం
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న యువతిపై గ్రామవాలంటీర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన దళిత యువతి (27) తల్లిదండ్రులు కొన్ని నెలల క్రితం మరణించారు.
అప్పటినుంచి ఆమె మందస మండలంలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది. రాత్రిపూట స్థానిక ఎంపీడీఓ కార్యాలయ వరండాలో నిద్రిస్తోంది. దాదాపు నెల క్రితం అదే మండలంలోని జిల్లుండకు చెందిన గ్రామ వాలంటీరు కుణితి బాలకృష్ణ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో మంగళవారం మందస పోలీసులకు ఫిర్యాదుచేసింది. యువతి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదుచేశామని, గురువారం నిందితుడిని అరెస్టు చేస్తామని ఎస్సై రవికుమార్ తెలిపారు.