Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కరోనా మహమ్మారి వల్ల పలు టెక్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. ఈ తరుణంలోనే డిస్నీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంక్షోభం వల్ల డిస్నీ గురువారం లేఆఫ్ ప్రకటించింది. స్ట్రీమింగ్ సబ్స్క్రైబర్లు తగ్గడంతో డిస్నీ 7,000 మంది ఉద్యోగులను తొలగించింది.
ఈ విషయాన్ని డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డిస్నీకి 1,90,000 మంది ఉద్యోగులున్నారు. వాల్ట్ డిస్నీ స్థాపించిన స్టోరీడ్ కంపెనీ తన స్ట్రీమింగ్ సర్వీస్ చందాదారుల సంఖ్య మొదటిసారి పడిపోయింది. దీంతో ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.