Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - షిమ్లా
హిమాచల్‌ప్రదేశ్ దారుణం చోటుచేసుకుంది. ఉనా జిల్లాలో ఏఎంబీ ప్రాంతంలోని ఓ మురికివాడలోని రెండు గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. ఈ తరుణంలో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
స్థానిక పోలీసు అధికారి పఠానియా సమాచారం మేరకు మృతులను బిహార్‌లోని దర్బంగా జిల్లా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో శివమ్ కుమార్(6), గోలుకుమార్ (7), నీతు (14) ఒకే కుటుంబానికి చెందిన వారు. వారితో పాటు పక్క ఇంట్లో ఉంటున్న సోను కుమార్ (17) సజీవ దహనమైనట్లు తెలుస్తుంది.