Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: సోమవారం నాటి భూకంపం ధాటికి అత్యధికంగా నష్టపోయిన తుర్కియేనే. దాదాపు 10 ప్రావిన్స్‌లు నామరూపాల్లేకుండా పోయాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. ఒక్కో భవన శిథిలాల కింద 4 వందల నుంచి 5 వందల మంది వరకు చిక్కుకుపోయి ఉండవచ్చని అంచనా. అయితే వారిని కాపాడేందుకు కనీసం 10 మంది సహాయక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. శిథిలాలను తొలగించడానికి సరైన యంత్రాలు కూడా లేవు. దీంతో తుర్కియే అధ్యక్షుడు రెసెస్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఆయన భూకంప బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను ఎర్డోగాన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో లోపాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే ఈ ఘోర విపత్తును ముందే ఊహించిన సిద్ధపడటం సాధ్యం కాదన్నారు. ‘‘అవును. కొన్ని లోపాలున్నాయి. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో మనందరికీ కన్పిస్తూనే ఉంది. ఇలాంటి విపత్తుకు సిద్ధంగా ఉండటం అనేది ఎవరికీ సాధ్యం కాదు’’ అని తెలిపారు.