Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నేడు శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిని ప్రయివేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు సింగరేణి బొగ్గు గనుల విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. నాలుగు బొగ్గు గనులు తమకే ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. కానీ నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నాం. అందులో పాల్గొనచ్చని కేంద్రం చెప్పిందని కేటీఆర్ తెలిపారు.
సింగరేణిని కార్మికులందరికీ మాటిస్తున్నాం అవసరమైతే ఎంత దూరమైనా పోతాం. సింగరేణిని ప్రయివేటుపరం చేయాలనే ఆలోచనలో ఉన్న కేంద్రం కుట్రను భగ్నం చేస్తాం. కార్మికులను, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుడుతాం. బయ్యారం విషయంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట తప్పింది. బయ్యారంలో స్టీల్ నిక్షేపాలు లేవని కేంద్ర మంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం ప్రారంభించాం. వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో కూడా జిందాల్, మిట్టల్ వారితో ప్రాథమికంగా సంప్రదింపులు ప్రారంభించాం. కేంద్రం ముందుకు రాకపోతే ప్రయివేటు రంగం ద్వారానైనా లేదా సింగరేణి ద్వారానైనా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు.