Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేరళ
ఇటీవల కేరళలో నిర్వహించిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లేటర్స్ ఇన్ కేరళ’ కార్యక్రమంలో నటుడు ప్రకాశ్‌రాజ్ పాల్గొన్నారు. ఈ తరుణంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా అంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ తీవ్ర విమర్శలు చేశారు.
‘‘ది కశ్మీర్ ఫైల్స్’ ఒక చెత్త సినిమా. దాన్ని ఎవరు నిర్మించారో మాకు తెలుసు. సిగ్గులేనితనం. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా ఈ చిత్రాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఇంత జరిగినా వాళ్లకు ఇంకా సిగ్గురాలేదు. ఆ చిత్ర దర్శకుడు ఇప్పటికీ నాకు ఎందుకు ఆస్కార్ రాలేదు? అని మాట్లాడుతున్నాడు. అతడికి ఆస్కార్ కాదు కదా భాస్కర్ కూడా రాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.