Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న తరుణంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఏపీలోని ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనితో పాటు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ స్థానాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.
- నోటిఫికేషన్- ఫిబ్రవరి 16
- నామినేషన్లకు చివరి తేదీ- ఫిబ్రవరి 23
- నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 24
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- ఫిబ్రవరి 27
- పోలింగ్ -మార్చి 13
- ఓట్ల లెక్కింపు- మార్చి 16