Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ భారీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో భారత్‌లో ట్విటర్ బ్లూ ఛార్జీలను ప్రకటించింది. అదనపు ఫీచర్లతో వచ్చే ట్విటర్ బ్లూ కోసం భారత యూజర్లు నెలకు రూ.900 చెల్లించాలని తెలిపింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఒకే ఛార్జీని ప్రకటించింది. అదే వెబ్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ యూజర్ల కోసం రూ.6,800ల ప్రత్యేక వార్షిక ప్లాన్‌ను కూడా ప్రకటించింది.
ఈ ప్రత్యేక సేవలను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి ట్వీట్లను తొలగించడం, ఎడిట్ చేయడం వంటి అదనపు ఫీచర్లు అందుతాయి. అలాగే అధిక నాణ్యతతో కూడిన సుదీర్ఘ వీడియోలను పోస్ట్ చేయొచ్చు. ప్రకటనలు సైతం భారీగా తగ్గుతాయి. ఈ క్రమంలోనే ఒకసారి ట్విటర్ బ్లూసబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ ఫొటో, డిస్ప్లే నేమ్, యూజర్‌నేమ్ మార్చడం చేయొద్దని ట్విటర్ సూచించింది. అలా చేస్తే తిరిగి వాటిని ధ్రువీకరించే వరకు బ్లూ టిక్ మార్క్‌ను తొలగిస్తామని తెలిపింది.