Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేగంపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతుల దర్నా
నవతెలంగాణ-బెజ్జంకి
వ్యవసాయ సాగుకు సమయపాలన లేని విద్యుత్ సరఫరాతో వరిపంటలు ఎండుతున్నాయని అధికారులపై కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.గురువారం మండల పరిధిలోని బేగంపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద లక్ష్మీపూర్ గ్రామ రైతులు దర్నా చేపట్టగా కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.తెగుళ్లు సోకి నశించిపోయిన వరిపంటలను కాపాడుకోవడానికి రైతులు తంటాలు పడుతుంటే విద్యుత్ అధికారుల తీరువల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు,గ్రామ రైతులు పాల్గొన్నారు.