Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె ఆర్ నాగరాజు
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని నిజామాబాద్ ప్రజలకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు గురువారం వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వివిధ ప్రాంతాల్లో వదిలివెళ్లిన, ఇతర నేరాల్లో వాహానాలతో పట్టుబడి వాహానాలను తీసుకవెళ్లకుండా ఉన్నవారి వాహానాలను వేలం వేసేందుకు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పోలీసులు నిర్ణయించారు. సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం సదరు వాహనాలను 06 నెలలో అనంతరం వేలం వేయనున్నారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటుకు చెందిన ట్విట్టర్, ఫేస్ బుక్ లో గురువారం వివరాలను పొందుపరచడం జరిగిందని వివరించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 226 వివిధ రకాల వాహనాలు కమీష- నరేటులోని పోలీస్ లైన్లో ఉన్నాయి. సంబంధిత వాహనాల యాజమానులు సదరు వాహనాలకు సంబంధించిన సరైన దృవపత్రాలను తీసుకువచ్చి నిజామాబాద్ రిజర్వు విభాగం (అడ్మిన్) పోలీస్ అధికారిని కలిసి చూపించినట్లయితే వాటిని పరిశీలించిన తరువాత పోలీస్ కమీషనర్ కే ఆర్ నాగరాజు ఆదేశాలతో వారి వాహానాలను ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశారు. సదరు వాహనాలకు సంబంధించిన వివరాలను
www.nizamabadpolice.in, https://twitter.com/cp_nizamabad, https://www.facebook.com/cpnizamabad, అందుబాటలో ఉంచడం జరిగిందన్నారు.ఇతర వివరాల కోసం అనిల్ కుమార్, రిజర్వు విభాగం (అడ్మిన్) అధికారి, సెల్ నెంబర్ : 87126-59701 సంప్రదించగలరు. నిజామాబాద్ పోలీసులు గతంలోనే ఇలాంటి వాహానాలకు వేలం నిర్వహించిన విషయం విదితమే అని తెలిపారు.