Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అమృత్‌సర్‌లో ఓ మైనర్ నుంచి 15 కేజీల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడి నుంచి 8.4 లక్షల నగదును కూడా సీజ్ చేశారు. రామ్ తీర్థ రోడ్డు వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ కుర్రాడి నుంచి 15 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నామని డీజీపీ గౌరవ్ యాదవ్ ఓ ట్వీట్లో తెలిపారు. ట్రాన్స్ బోర్డర్ నార్కోటిక్స్ స్మగ్లింగ్ రాకెట్ నడుపుతున్న రేషమ్ సింగ్ పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. నార్కోటిక్స్ డ్రగ్స్ సెక్షన్ల కింద కేసును బుక్ చేసినట్లు చెప్పారు.