Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకేర్ జిల్లా భానుప్రతాప్పూర్లో ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు.. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు.. భానుప్రతాప్పూర్ - కాంకేర్ మధ్య కోరేర్ సమీపంలో ప్రమాదం ఆటోను లారీ ఢీకొట్టినట్లుగా తెలుస్తున్నది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.