Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 2 స్మాల్ శాటిలైట్ లాంచర్ నింగిలోకి మరికొద్ది గంటల్లో దూసుకెళ్లనుంది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు లాంచర్‌ను ప్రయోగించేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాకెట్‌కు చివరి విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి ఏడు గంటల ముందు అంటే శుక్రవారం తెల్లవారుజాము 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. ఈ లాంచర్లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్-01, ఆజాదీశాట్-02 అనే మూడు చిన్న తరహా ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనున్నది. గత సంవత్సరం ఆగస్టు 7న ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ -డీ1 మిషన్ రాకెట్‌ని రెండవ దశ వేరుచేసే సమయంలో సాంకేతిక కారణాలతో ప్రయోగం విగాణ--ఫలమైంది. ఆరు నెలల తర్వాత ఎస్ఎస్ఎల్వీ -డీ 2 పేరుతో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టి రేపు రోదసిలోకి రాకెట్‌ను పంపేందుకు ఏర్పాట్లు చేసింది. 34 మీటర్ల పొడవు ,రెండు మీటర్ల వ్యాసం కలిగిన ఈ రాకెట్ 120 టన్నుల లిఫ్ట్-ఆఫ్ ద్రవ్యరాశిని కలిగి ఉందని అధికారులు తెలిపారు.