Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న జనంపైకి ఒక ఎద్దు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. హజ్రత్ ఖ్వాజా షంసుద్దీన్ గాజీ రెహ్మతుల్లాహిన్ దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సుమారు 15 వేల మంది భక్తులు అక్కడ ఉన్నారు. అయితే ఒక ఎద్దు జనం మీదకు పరుగులు తీసింది. దీంతో భక్తులు భయాందోళన చెందారు. అక్కడకున్న వారు ఒక్కసారిగా తోసుకోవడంతో తోక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో 14 మంది భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఎద్దు దూసుకెళ్లంతో భయంతో జరిగిన తొక్కిసలాట వంటి పరిస్థితిని అదుపు చేశారు.