Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
పరుగుల రాణి పీటీ ఉష రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆమె ప్యానెల్ వైస్ చైర్మన్ జాబితాలోనూ స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా, నేడు ప్యానెల్ వైస్ చైర్మన్ హోదాలో రాజ్యసభను నడిపించారు. ఇవాళ సభ జరుగుతుండగా, చైర్మన్ (భారత ఉపరాష్ట్రపతి) జగ్ దీప్ ధన్ కర్ గైర్హాజరీలో, సభాపతి ఆసనంలో పీటీ ఉష కూర్చున్నారు. దీనిపై పీటీ ఉష తన స్పందనను ట్విట్టర్ లో వెల్లడించారు. శక్తిమంతమైన పదవి గొప్ప బాధ్యతను కలిగి ఉంటుందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ వ్యాఖ్యలను ఆమె ఉదహరించారు. ఇవాళ వైస్ చైర్మన్ హోదాలో రాజ్యసభ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తాను కూడా అదే అనుభూతికి లోనయ్యానని వివరించారు. తన ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతో ఈ ప్రయాణంలో ఘనతలు అందుకోగలనంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.