Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసేవారు. పాదయాత్ర కాన్వాయ్ నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర 14వ రోజుకు చేరింది.