Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మహేశ్వరం సమీపంలోని తుమ్మనూరు గేటు వద్ద గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. డీసీఎంను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులను నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లికి చెందిన కేశవులు, యాదయ్య, శ్రీను, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామస్వామిగా గుర్తించారు. హైదరాబాద్లో జరిగి ఓ శుభకార్యంలో వంటచేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.