Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరుగనుంది. ఈ నెల 6న మంత్రి హరీశ్ రావు 2023-24కుగాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్పద్దులపై సభలో గురువారం చర్చ ప్రారంభమైంది. నేడు సమాచార-పౌరసంబంధాలు, పరిశ్రమలు, ఐటీ, పురపాలక, కార్మిక, దేవాదాయ, అటవీ, న్యాయ, ఇంధన, విద్యాశాఖకు చెందిన మొత్తం 12 పద్దులపై చర్చ జరుపనున్నారు. భద్రాచలం, సారపాక, రాజంపేట గ్రామపంచాయతీల ఏర్పాటు కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ప్రశ్నోత్తరాల్లో భాగంగా మెడికల్ కాలేజీఉ, ఆసరా పింఛన్లు, ఆయిల్పాము సాగు, పోడు భూముల సమస్య, న్యూట్రిషన్ కిట్, రైతుబీమా, ఆరోగ్యలక్ష్మి పథకాలు, షీటీమ్స్ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. సభ్యుల ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానమివ్వనున్నారు.